చిన్నపిల్లలు, వృద్ధులకు తప్పనిసరిగా జియో ట్యాగ్ కౌంటర్లు- ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి
తిరుమల ముచ్చట్లు:
తిరుమలకు వచ్చే భక్తులు కూడా (వృద్ధులు, చిన్నపిల్లలు) విధిగా జియో ట్యాగ్ ను కట్టుకోవాలి. భక్తుల భద్రతే ప్రధాన ధ్యేయం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. 5 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశాం. భక్తులకు సంతృప్తికరంగా వాహనసేవ దర్శనం కల్పిస్తాం. సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 26 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగనుంది. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీలలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల తోపులాట జరుగకుండా సిబ్బందిని ఏర్పాటు చేశాం. గరుడ వాహన సేవలో భక్తుల రీఫిల్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. సెప్టెంబర్ 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు తిరుపతి లోని శ్రీనివాస సేతును సీఎం ప్రారంభిస్తారు. అనంతరం తిరుమలకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహనం ను సీఎం వీక్షించిన తర్వాత పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్త్ చేశాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, వాహన సేవ దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలకు 4 వేల మంది పోలీసుల సిబ్బందితో భద్రత కల్పిస్తాం. గరుడ సేవ నాడు అదనంగా వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశాం.

తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నందున మిగిలిన వారు తిరుపతిలో పార్కింగ్ ఏర్పాటు చేశాం. చిన్నారులకు జియో ట్యాగింగ్, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నిర్వహణ, వీఐపీలు, భక్తుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించాం. మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. 2 వేల సీసీ కెమెరాలతో తిరుమల మొత్తం నిఘా ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసందానం చేశాం. వీలైనంత వరకూ బ్రహ్మోత్సవాల సమయంలో చిన్నారులను తిరుమలకు తీసుకుని రావద్దు, వచ్చినవారు తగు జాగ్రత్తలు పాటించాలి. నడక మార్గంలో వన్యమృగాల సంచారం నేపథ్యంలో హై అలెర్ట్ జోన్ ప్రాంతంలో మరికొంత మందితో భద్రత కల్పిస్తున్నాం. గరుడ సేవ ముందు రోజు మధ్యాహ్నం నుండి తిరుమలకు ద్విచక్ర వాహనాల అనుమతిని నిలిపి వేస్తున్నాం. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. భక్తులు సమన్వయం పాటించి స్వామి వారి దర్శనం, వాహన సేవలు దర్శించాలి.
ఈ బ్రహ్మోత్సవాలకు చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలు,పిట్ ప్యాకెట్ ల పై వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాల నుండి 220 మంది స్పెషల్ క్రైమ్ సిబ్బంది రావడమైనది. వీరంతా పాత నేరస్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అలిపిరి నడక మార్గంలో గత కొద్ది రోజులకు ముందు జరిగిన చిరుత పులి దాడి కారణంగా నాలుగు కిలోమీటర్ల వరకు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి అక్కడ ఏపీఎస్పీ పోలీస్ సిబ్బందిని మరియు టీటీడీ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బందితో కలిసి పహారా కాస్తున్నారు. నడక మార్గము ద్వారా నడిచి వచ్చే భక్తులకు ఎటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.ఇంతకు ముందు అనుమానిత THREATENING CALL ఫేక్ అని గుర్తించి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయినది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పుడు అలాంటి వార్తలను చూసి భయపడనవసరం లేదు అలా ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈసారి బ్రహ్మోత్సవాలకు ఆక్టోపస్ సిబ్బంది అదనంగా వచ్చారు. వీరు టెంపుల్ భద్రతపై మరియు విఐపి భద్రతపై గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు మరియు శ్రీవారి భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి.. మీరు తిరుమల కు వచ్చేటప్పుడు విలువైన వస్తువులను మరియు సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలను తీసుకురాకపోవడం మంచిది. వచ్చినవారు తప్పనిసరిగా జియో ట్యాగ్ ఏర్పాటుచేసిన కౌంటర్లలో కట్టుకోవాలి తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మరియు పోలీసులు నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించగలరని విజ్ఞప్తి చేస్తున్నామని జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి అన్నారు.
Tags:Geo tag counters for young children and elderly- SPP Parameshwara Reddy
