దేశ ఆర్థిక వ్యవస్థలో అంకురాలు కీలకం- వీసీ ఆచార్య సూర్యకళావతి

కడప ముచ్చట్లు:

దేశంలోని స్టార్టప్‌లు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారా యని యోగి వేమన విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి అన్నారు. వైవీయూ లోని వాణిజ్య శాస్త్ర శాఖ ఆధ్వర్యంలో  “ఎంటర్ప్రేన్యూరల్ ట్రెండ్స్ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ”అంతర్జాల సదస్సు గురువారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆచార్య మునగల సూర్యకళావతి  మాట్లాడుతూ వినూత్న వ్యాపారాలు తరచుగా ప్రవేశించి వ్యవస్థాపక పరిజ్ఞాన అవసరాన్ని పెంచుతు న్నాయ న్నారు.ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో మనలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలనుఆర్థికపరంగా బలోపేతం చేసేందుకు  ఇంటి నుండి సంపాదించడం  చేయాలని ఆలోచిస్తున్నాః అని గుర్తుచేశారు.అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ ఫ్రెండ్లీ విధానం, కొత్త పన్నుల విధానం, జిఎస్‌టిలో సడలింపు, వ్యాపార నమోదు సౌలభ్యం వంటి అంశాలలో అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశం నలుమూలల నుండి ఆలోచనలు  పంచుకోవ డానికి అలాగే ఫలవంతమైన ఫలితాలను తీసుకురావడానికి సెమినార్లో భాగస్వాములైన వారిని అభినం దించారు.

 

కొత్త ఆలోచన రేకెత్తించేలా సదస్సు అంశాన్ని ఎంపిక చేసిన   కన్వీనర్ డాక్టర్ విజయ భారతిని ప్రశంసించారు. కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవ ప్రసాద్మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు సమాజ అవసరాలు చాలా ముఖ్యమైనవి అన్నారు. ప్రధానాచార్యులు కె. కృష్ణా రెడ్డి చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ ని ఆదర్శంగా తీసుకుని కడప జిల్లాలో అలాంటి  పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. సదస్సు కీలకోపన్యాసకురాలు ఇండో అమెరికన్ చెందిన సింధియా పడాల మాట్లాడుతూ వ్యాపార సంస్థలకు సంబంధించిన మేం అంశాలను స్లైడ్ల ద్వారా ప్రదర్శించి వివరించారు. మరో ఉపన్యాసకులు గడ్డం సుదర్శన్ పరిశ్రమ స్థాపన యువత పాత్ర గురించి వివ రించారు. వై వి యు ఉపప్రధా నాచార్యులు టి.శ్రీనివాస్ సదస్సును సమన్వయంచేశారు.ఈకార్యక్రమంలో  సదస్సు కన్వీనర్ డాక్టర్ విజయ భారతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు లోకనాథ్ రెడ్డి,  సీ డి సి డీన్ డాక్టర్ వై సుబ్బరాయుడు,  అధ్యాపకులు డాక్టర్ హరినాథ్, రఫీ, రజిని, హరి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Germination is crucial in the country’s economy- VC Acharya Suryakalavati

Post Midle
Natyam ad