Natyam ad

ప్రజా జీవితానికి దగ్గరవ్వండి..రౌడీయిజాన్ని విడనాడండి.

– సస్పెక్ట్ షీటర్లు ఎవరైనా రౌడీయిజం, గుండాయిజం కు పాల్పడితే PD-ACT ప్రయోగం.

– శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తులపై ఉక్కు పాదం..రాజీపడకుండా చర్యలు తీసుకోండి.

– చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలైన రౌడీయిజం, గుండాయిజం లపై ప్రత్యేక నిఘా పెట్టండి.

Post Midle

– రాబోయే ఎన్నికల నేపథ్యంలో A- కేటగిరి రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లు దేహ సంబంధిత నేరాలు చేయకుండా నివారణ చర్యలు.

– రౌడీ షీటర్లు బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చి ఏదైనా నేరం చేసినా, కోర్టు విచారణకు గైర్హాజరు అయినా, వెంటనే రద్దు చేస్తాం.

– ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినప్పటి నుంచి నేర నిరూపణ చేసేంత వరకు అసలైన సవాళ్లు ఉంటాయి. ఈ సవాళ్లను అధిగమించి నేరస్తులను శిక్షించేలా చర్యలు.

– ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ చేసి రౌడీ షీటర్లను తనిఖీ చేయాలి, రౌడీషీటర్ల ప్రవర్తన పై స్థానికులను విచారించాలి.

– ఎదైనా ముందస్తు సమాచారం అవసరం, వీజీబుల్ పోలీసింగ్ ద్వార ప్రజలకు దగ్గర అయ్యే విధంగా మన చర్యలు ఉండాలన్నారు.

– అధికారులు మేము ఉన్నాము అనే విదంగా సిబ్బందితో సమఖ్యత పెంచుకోవాలి.

 

తిరుపతి  ముచ్చట్లు:

జిల్లా పోలీసు అధికారులతో అనంతపురం రేంజ్ డీఐజీ   ఆర్.ఎన్. అమ్మి రెడ్డి ఐపీఎస్.,  జిల్లా ఎస్పీ  పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., తో కలిసి నేర సమీక్ష సమావేశం నిర్వహణ.శనివారం నాడు అనంతపురం రేంజ్ డీఐజీ మరియు జిల్లా ఎస్పీ గారు జిల్లాలోని సిఐ, ఆపై స్థాయి పోలీసు అధికారులతో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అనంతపురం రేంజ్ డిఐజి  ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఐపిఎస్.,  మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలతో పాటు అసాంఘిక శక్తుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ నేరాల్లో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఫోక్సో, తదితర కేసుల్లో అలసత్వం ఉండరాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

 

 

రాబోయే ఎన్నికల నేపథ్యంలో A- కేటగిరి రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లు దేహ సంబంధిత నేరాలు చేయకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా వారిపై ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు ఫైల్ చేయాలన్నారు. కోర్టు విచారణ సజావుగా జరిపించి నేర నిరూపణ చేస్తే తప్పకుండా జైలు శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంటుందని, పర్యవసానంగా సదరు రౌడీషీటర్ల, ట్రబుల్ మాంగర్ల అనుచరులు కూడా అభద్రతాభావానికి గురై ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటారన్నారు.రౌడీ షీటర్లు బెయిల్ మీద జైలు నుండి బయటకు వచ్చి ఏదైనా కొత్త నేరాలలో సంబంధం ఉంటే, వెంటనే సమాజ శ్రేయస్సు కోసం.. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నాడని ప్రతికూల నోటీసును సదరు రౌడీషీటర్లకు కోర్టు ద్వారా పంపి బెయిల్ ను రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుగా పరిగణించి సదరు రౌడీషీటర్ల కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి, కోర్టు విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుని శిక్షపడేటట్లు కృషి చేయడం వలన అనుచరులు, మిగతా రౌడీ షీటర్లు కూడా సన్మార్గం వైపు పయనించి ప్రశాంత జీవితానికి అలవాటు పడడం ద్వారా, నేరాల శాతం గణనీయంగా తగ్గించవచ్చునన్నారు.

 

 

ఈ ఏడాది జరిగిన గ్రేవ్ కేసులు అంతకు మునుపు పెండింగులో ఉన్న UI కేసులు, PT కేసులను సర్కిల్ వారీగా సమీక్ష చేశారు. ఈ కేసుల స్థితిగతులు, పురోగతిపై ఆరా తీశారు. ఆయా కేసుల ఛేదింపునకు మెలకువలు, దిశానిర్ధేశం చేశారు. నేర పరిశోధన అధికారుల పనితీరును కూడా సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు మాట్లాడుతూ అలాగే A- కేటగిరి రౌడీషీటర్లు ఏదైనా కేసులలో సంబంధపడి ఉంటే ఆ కేసు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నది అనే విషయం గురించి పోలీస్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఇలాంటి కేసులలో సాక్షులను, బాధితులను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కేసులను త్వరగా దర్యాప్తు చేసి, శిక్ష పడేటట్లు చేయాల్సిన బాధ్యత సదరు దర్యాప్తు అధికారి పై ఉన్నదన్నారు. ఆకస్మికంగా SHO లు, దర్యాప్తు అధికారులు కోర్టు విచారణకు హాజరవ్వాలి. తరచుగా P.P., A.P.P. వారిని కలసి A- కేటగిరి రౌడీషీటర్ల కేసు వివరాలను గురించి ఆరా తీయాలని, కోర్టు కానిస్టేబుల్ పనితీరును ప్రతి వారం సమీక్ష చేయాలని, అదేవిధంగా కేసులలో నేర నిరూపణ చేసి, శిక్ష పడేటట్టు కృషి చేయాలన్నారు.

 

 

సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి.. ప్రాణాలకు తెగించి పోలీసులు డ్యూటీ చేస్తుంటారు. అలాంటి పోలీసులకి విధి నిర్వహణలో.. రౌడీ షీటర్స్, వారి చర్యలు తలనొప్పులుగా మారుతున్నాయి. రౌడీయిజం ఒక బాధ్యత/వారసత్వం కాదు..రౌడీయిజం ఒక మహమ్మారి..సమయం వచ్చినప్పుడు నిన్ను, నీతోటి వారిని అమాంతం మింగేస్తుందని రౌడీ షీటర్లను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు  వెంకట్రావు పరిపాలన,  కులశేఖర్ శాంతి భద్రత,  రాజేంద్ర సెబ్, విమల కుమారి నేర విభాగం,  ముని రామయ్య తిరుమల, ఎస్బి డిఎస్పి గిరిధర, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.

Tags:Get closer to public life..leave rowdyism.

Post Midle