Get ready for municipal elections

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్దంకండి

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపల్‌ ఎన్నికల నోటీఫికేషన్‌ త్వరలోనే రానున్నదని ఈ మేరకు సిద్దంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి నారాయణ భరత్‌గుప్తా వీడియో కాన్ఫిరెన్స్లో గురువారం పుంగనూరు, ఈఆర్‌వో కెఎల్‌.వర్మను ఆదేశించారు. ఆయన చిత్తూరు నుంచి వీడియో కాన్ఫిరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూలు త్వరలో రానున్నదని, ఇందు కోసం యంత్రాంగాన్ని సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల ఓటర్ల జాబితాలు సిద్దమైందన్నారు. అలాగే వార్డుల రిజర్వేషన్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించగానే పక్రియ ప్రారంభిస్తామన్నారు. అలాగే ఎన్నికల విధుల కోసం సిబ్బంది నియామకాలు సిద్దం చేశామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌ఐ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

16న అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Tags; Get ready for municipal elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *