ఇండ్ల పట్టాల పంపిణీకి సిద్దంకండి

-సబ్‌ కలెక్టర్‌ జహ్నావి

Date:04/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 25న పేదలకు పంపిణీ చేయనున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేయాలని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జహ్నావి ఆదేశించారు. శుక్రవారం ఆమె పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లె, రాంపల్లెలో ఇండ్ల స్థలాల కోసం సేకరించిన భూమి, రికార్డులను పరిశీలించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేస్తున్న బైపాస్‌ రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్ల పట్టాల పంపిణీ పకడ్భంధిగా నిర్వహిస్తూ, అర్హులైన పేదలందరికి ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఈమె వెంట తహశీల్ధార్‌ వెంకట్రాయులు, డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు, ఆర్‌ఐ రాంప్రసాద్‌, సర్వేయర్లు సుబ్రమణ్యం, ప్రకాష్‌ పర్యటించారు.

పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ

Tags; Get ready for the distribution of house rails

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *