రైతులను ఆదుకోండి  

Date:27/05/2020

కోసిగి  ముచ్చట్లు:

-లాక్ డౌన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కోసిగి తాసిల్దార్ కార్యాలయం ముందు సామాజిక దూరం పాటిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్ష కార్యదర్శులు వీరేష్ పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు అన్నారు రైతులు పండించిన పంటలకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నా రూ లాక్ డోన్ కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఈ ప్యాకేజీలో రైతులను విస్మరించడం చాలా బాధాకరం అని వారు అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల్ని ఆల్ పోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేయాలని వారు కోరారు.

 

 

 

రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులకు సంబంధించిన అన్ని రకాల అప్పులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని కొత్త రుణాలు అందించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేసి రైతులు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అదేవిధంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంట రుణాలు రైతు భరోసా అందించాలని రైతులకు ఉచితంగా విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు అందించాలని ని 2018 మిది పంట నష్ట పరిహారం మరియు ఫసల్ బీమా ఇన్సూరెన్స్ రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని లాక్‌డౌన్‌ కాలంలో కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముకుంద రావు కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాముడు మల్లికార్జున వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిద్ధప్ప ప్రభాకర్ ర్ నారాయణ రైతు సంఘం నాయకులు హనుమంతు వీరేష్ గోవిందు రవి మల్లయ్య వినోద్ గోపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

టీవీ యాజమాన్యలతో మంత్రి తలసాని భేటీ

Tags:Get rid of farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *