పుంగనూరు గ్రంధాలయాల్లో వేసవి శిక్షణ పొందండి

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లాలోని గ్రంధాలయాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులలో విద్యార్థులు పాల్గొని మేదోశక్తిని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంధాలయాల కార్యదర్శి ప్రకాష్‌ కోరారు. శనివారం ఆయన పుంగనూరు గ్రంధాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం, స్పోకెన్‌ ఇం•ష్‌, నృత్యం, పుస్తక పఠనంపై శిక్షణ పొందుతున్న విద్యార్థులను శిక్షణ గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి శిక్షణలో చేర్పించాలని, దీని ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యలు ఉచితంగా నేర్చుకునేందుకు వీలుందన్నారు. ఇలాంటి తరగతులు ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లోను నిష్ణాతులుగా మారుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రంధాలయ అధికారులు విజయకుమార్‌, నసీబ్‌జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Get summer training at Punganur Libraries

Post Midle
Natyam ad