ఘనంగా దేవినేని నెహ్రు జయంతి

విజయవాడ ముచ్చట్లు:

మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్,, రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  తరువాత వందలాది మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ నెహ్రు జయంతి సందర్భంగా అనేక ప్రాంతాలలో ఆయన అభిమానులు నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎంఎల్ఏ, మంత్రిగా నెహ్రు గారు పేదలకు ఎన్నో సేవలు చేసారు. దేవినేని నెహ్రూ  ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్ధగా ఉన్నారు. మాటిచ్చారంటే ఆ మాట నిలబెట్టుకునే విధంగా పనిచేసే వ్యక్తి దేవినేని నెహ్రూ. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళతాం. గడప గడపకు కార్యక్రమంలో మూడు నెలలుగా తిరుగుతున్నాం. పేద ప్రజలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ తరువాత సంక్షేమ కార్యక్రమాలు చేసింది సీఎం జగన్ మాత్రమే. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి నాకు అప్పజెప్పారు. గతంలో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గ లలో కూడా కోట్లాది రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ నెహ్రు జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు అండగా నిలిచారు. ప్రతీ పేదవాడికి అందుబాటులో ఉంటూ దేవినేని నెహ్రూ గారి పేరు నిలబెడుతున్నారు అవినాష్ . రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అవినాష్ ను గెలిపిస్తారని కోరుతున్నాం. జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ని ప్రజలకు మరింత చేరువ చేస్తామని అన్నారు. ఈ  జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్లు పుప్పాల కుమారి,తంగిరాల రామిరెడ్డి,చింతల సాంబయ్య,మాధురి,కొండారెడ్డి,ప్రవల్లికా, రెహన నాహిద్,నిర్మల కుమారి మరియు డివిజన్ ఇన్ఛార్జ్ లు,,నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

 

Tags: Ghananga Devineni Nehru Jayanti