ఘనంగా గాంధారి మైసమ్మ జాతర

-గాంధారి ఖిల్లా ను పర్యాటక ప్రాంతంగా మారుస్తాం…..
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
 
మంచిర్యాల ముచ్చట్లు:
 
మంచిర్యాల జిల్లా  మందమర్రి మండలం బొక్కలగుట్ట  అటవీ ప్రాంతంలో ఉన్న గాంధారి ఖిల్లా ను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు…గత మూడు రోజులుగా గాంధారి
ఖిల్లా పై మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో గాంధారిఖిల్లాపై సందడి నెలకొంది… ఆదివాసీ, నాయకోపోడ్ కుటుంబ సభ్యులు ఖిల్లాలోని దర్వాజ వద్ద గాంధారిమైసమ్మతో పాటు కాలభైరవుడు, నాగదేవత, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీలు తమ సంస్కృతి,
సంప్రదాయాలతో చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి… గాంధారిఖిల్లా సందర్శించిన బాల్క సుమన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
Tags:Ghananga Gandhari Mysamma Jatara