ఘనంగా శ్రీ సాయినాథ్ 19 వ వార్షిక కుంభాభిషేక మహోత్సవం

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరంలోని చిల్డ్రన్ పార్క్ సమీపంలో ఉన్న శ్రీ సాయి సదన్ షిరిడి సాయి బాబా మందిరంలో గురువారం ఘనంగా శ్రీ సాయినాథ్ మహారాజ్ 19 వ వార్షిక కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం సౌభాగ్యమాహేశ్వరీ పీఠాధిపతులు శ్రీ శ్రీ రామానంద భారతి మహాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపకులు- ఇన్చార్జ్ కె .శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి ఆంజనేయ స్వామి సహాయ సహకారాలతో పదవ తేదీ మంగళవారం ఉదయం ధునిపూజ, సాయంత్రం శ్రీ సాయి నామ సంకీర్తన మరియు శ్రీ సాయి భజనలు, 11వ తేదీ బుధవారం ఉదయం సామూహిక ధునిపూజ, సాయంత్రం శ్రీ సాయి నామ సంకీర్తన మరియు కోలాట నృత్యాలు అష్టోత్తర శత కలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే గురువారం ఉదయం కాగడ హారతి, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశ పూజ, రుద్ర హోమం నక్షత్ర సహిత నవగ్రహ హోమం పరిహార దేవత హోమం కార్యక్రమాలు నిర్వహించి సింహపురి ప్రజలకు మంచి ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక తర్వాత కులు కె .శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ రామానంద భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా మంగళ, బుధ ,గురు వారాలలో శ్రీ సాయి నాధుని కి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు సింహపురి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం హోమం నిర్వహించడం జరిగిందన్నారు. 108 మరియు 108 మరియు 9 కలశాలతో శ్రీ సాయినాధునికి కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ద్వారకామాయిలో జరిగినటువంటి స్వామివారి సేవలో స్మరిస్తూ నెల్లూరు నగరంలోని శ్రీ సాయినాధునికి సింహపురి ప్రజలు 225(108+108+9) కలశాలతో శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జరిపిన కుంభాభిషేక మహోత్సవంలో తమ వంతు బాధ్యతగా సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కృపా కటాక్షాలకు పాత్రలు కావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు.

 

Tags: Ghananga Sri Sainath 19th Annual Kumbhabhishek Mahotsavam

Post Midle
Post Midle
Natyam ad