GHMC for distribution of rice and food from donors

 దాతల నుండి బియ్యం, ఆహారం సేకరణ  – పంపిణీకి జిహెచ్ఎంసి

Date:03/04/2020

హైదరాబాద్, ముచ్చట్లు:

లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు  స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహార ప్యాకెట్లను, బియ్యాన్ని విరాళంగా అందిస్తున్నారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. అయితే వారి ఉద్దేశం మంచిదైనప్పటికీ సామాజిక దూరం పాటించకపోవడం వలన బియ్యం, ఆహార ప్యాకెట్లకై వందల సంఖ్యలో ఒకే చోట ప్రజలు గుమికూడటంతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నదని తెలిపారు. దానిని నివారించుటకు దాతల నుండి బియ్యం, ఆహారంను సేకరించుటకై జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ ఏ. ప్రియాంక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా పది మొబైల్ వాహనాల ద్వారా దాతల నుండి ఆహారం, బియ్యాన్ని సేకరించి అవసరమైన ప్రజలకు జిహెచ్ఎంసి ద్వారానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో గత వారం రోజుల నుండి ఎన్.జి.ఓ.స్, దాతలు నేరుగా  భోజనం ప్యాకెట్లను, నిత్యవసర వస్తువులను పంచడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్స్ ఎవరూ పాటించడం లేదు. దీని వలన కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నది.

 

 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టుటకై జిహెచ్ఎంసిలో సెంట్రలైజ్డ్ వింగ్ ద్వారా మాత్రమే బియ్యం, ఆహారాన్ని దాతల నుండి సేకరించి, పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక నుండి జిహెచ్ఎంసిలో నెలకోల్పిన సెంట్రలైజ్డ్ వింగ్కు సమాచారం ఇస్తే మొబైల్ వాహనాల ద్వారా అధికారులే సేకరించి, పంపిణీ చేస్తారని తెలిపారు. ఆహార పదార్థాలను, బియ్యాన్ని ఇతర వస్తువులను నేరుగా పంపిణీ చేస్తే సంబంధిత దాతలు, వ్యక్తులపై  ప్రభుత్వ పరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇక నుండి దాతలు బియ్యం, ఆహార ప్యాకెట్లను అందజేసేందుకు ట్విట్టర్  ఖాతా లేదా సెల్ నెం: 94931 20244,  70939 06449  లను సంప్రదించాలని సూచించారు. అలాగే తాత్కాలిక షెల్టర్ హోమ్లలో ఉంచిన వలస కార్మికులు, నిరాశ్రయులు, అనాథలకు మాస్కులు, ఇతర వస్తువులను పంపిణీ చేయుటకై జిహెచ్ఎంసి ప్రత్యేక విభాగాన్ని సంప్రదించవచ్చునని మేయర్ తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు

Tags:GHMC for distribution of rice and food from donors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *