ఆదాయం పై దృష్ఠి సారించిన జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్

Date:14/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఆదాయాన్ని చేకూర్చడంపై దృష్టిసారించింది జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్. అన్ని రకాల అనుమతులును ‘ఆన్‌లైన్ లో  సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూర తిరిగే విధానానికి స్వస్తి పలకడం, వేగంగా దరఖాస్తుల ను పరిష్కరించడం ద్వారా సాం కేతిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ళ క్రితం ప్రారంభించిన డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టిం సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అన్ని రకా ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే అందించేలా చర్యలు తీ సుకుంటుంది. భవన నిర్మాణాల అనుమతులు, నివాస యోగ్యతా పత్రాలు మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తూ, అదే వ్యవస్థలోనే అనుమతులు మంజూరు చేసిన పత్రాలను దరఖాస్తుదారులకు చేరవేస్తున్నది. ఫలితంగా ఇటు దరఖాస్తుదారులు, అటు ప్లానింగ్ అధికారులు ఉపశమనం పొందుతున్నారు.  2018-19 ఆర్థిక సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ నాటికి ప్లానింగ్ విభాగం మొత్తం 14,145 భవన నిర్మాణాలకు అనుమతులు, నిర్మాణాలు పూర్తిచేసుకున్న భవనాలకు నివాస యోగ్యతా పత్రం(ఆక్యుపెన్సీ సర్టిఫికెట్)లు 1,557లను మంజూరు చేయడం జరిగింది.
వీటి ద్వారా జిహెచ్‌ఎంసి ఖజానాకు రూ. 765.70 కోట్లు ఆదాయంగా చేరాయి. 2016లో ప్రారంభించిన డిపిఎంఎస్ పద్దతి ద్వారా దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం జరుగుతుంది. గతంలో ఒక్క దరఖాస్తు పరిష్కారానికి కనీసంగా 70 రోజుల వరకు సమయం పట్టేది. డిపిఎంఎస్ అమలులోకి వచ్చినతర్వాత గరిష్టంగా 30 రోజుల్లో పరిష్కరించడం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు గతంలో కనీసంగా 45 రోజులు తీసుకునే అధికారులు ఇప్పుడు కేవలం 15 రోజుల్లో జారీచేస్తున్నారు. సంస్థకు ఆదాయం చేకూరడమే కాకుండా దరఖాస్తుదారుల తిప్పలు తప్పుతున్నాయి. ఈ డిపిఎంఎస్ విధానంలో దేశంలోనే పూణె పురపాలక సంస్థ తర్వాత జిహెచ్‌ఎంసియే వంద శాతం ఆన్‌లైన్ దరఖాస్తుల పరిష్కార పద్దతి ని అమలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమనిర్మాణాల విషయం లో వస్తున్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ప్ర భుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. 625 చ.కి. మీ.ల విస్తీర్ణలో ఉన్న జిహెచ్‌ఎంసిలో టౌన్‌ప్లానింగ్‌లో అధికారుల కొరత చాలా ఉన్నది.
కనీసంగా మరో 300 మంది అధికారులు, సిబ్బంది సంస్థకు అవసరమున్నది. అయితే, ప్రభుత్వం మాత్రం 200 పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీచేసేందుకు అంగీకరించింది. కానీ, అవి నేటికీ భర్తీకాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.డిపిఎంఎస్ విధానంలో దరఖాస్తుతో పాటు జతపరచాల్సిన అన్ని ధృవీకరణ పత్రాలు చేర్చితే ఆ దరఖాస్తు వేగంగా పరిష్కారం జరుగుతుంది. ఆర్కిటెక్చర్‌లు కూడా దరఖాస్తు పరిష్కారానికి అర్హతగా ఉన్న అన్ని దరఖాస్తులను జతపరిచిన తర్వాతనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. కానీ, ఆర్కిటెక్చర్‌లు ఆ దిశగా చేయడంలేదు. ఫలితంగా షార్ట్‌పాల్స్ సమస్య తెరపైకి వస్తుంది. అనంతరం అధికారుల సూచన మేరకు ఆర్కిటెక్చర్‌లు లేదా లైసెన్స్ ఇంజినీర్లు ధృవీకరణ పత్రాలు జతపరచడంతో దరఖాస్తులు పరిష్కారమవుతున్నాయి. కానీ, ఆర్కిటెక్చర్‌లు లేదా ఇంజనీర్లు నియమాల ప్రకారంగా ధృవీకరణ పత్రాలు జతపరచనందుకు వారిపై నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ, ప్లానింగ్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:GHMC Townplinking, which focuses on income

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *