హ‌రిత‌హారానికి స‌ర్వం సిద్దమైన జీహెచ్ఎంసీ

-నాటే మొక్క‌ల‌కు జియోట్యాగింగ్‌…సీ.ఎస్‌.ఆర్ కింద ట్రీగార్డ్‌లు
Date:13/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 40ల‌క్ష‌ల మొక్క‌లు నాట‌డానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. ఈ 40ల‌క్ష‌ల మొక్క‌ల్లో 5ల‌క్ష‌ల మొక్క‌లను జీహెచ్ఎంసీ ద్వారా న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాలు, ర‌హ‌దారుల వెంట నాటుతుండ‌గా, మిగిలిన 35ల‌క్ష‌ల మొక్క‌ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు ఉచితంగా పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. జీహెచ్ఎంసీ నాట‌నున్న 5ల‌క్ష‌ల మొక్క‌ల‌కు సంబంధించి అధిక శాతం స్థ‌లాల ఎంపిక చేయ‌డంతో పాటు వాటి జియోట్యాగింగ్ కూడా చేప‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే మొక్క‌లు నాట‌డానికి గుంత‌ల త‌వ్వ‌కం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. జీహెచ్ఎంసీ ద్వారా నాట‌నున్న 5ల‌క్ష‌ల మొక్క‌ల్లో ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో 95వేలు, చార్మినార్ జోన్‌లో 65వేలు, ఖైర‌తాబాద్ జోన్‌లో 79,600, శేరిలింగంప‌ల్లి జోన్‌లో 85,250, కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో 1,01,050 మొక్క‌లు, సికింద్రాబాద్ జోన్‌లో 74,100 మొక్క‌లు నాట‌డానికి ఏర్పాట్ల‌ను చేప‌ట్టారు. ఇప్ప‌టికే మొక్క‌లు నాటేందుకుగాను 3,60,880 హెక్టార్ల భూమిని దాదాపు 2వేల ప్రాంతాల్లో గుర్తించారు. వీటిలో మొక్క‌లు నాటేందుకుగాను గుంత‌లు త్ర‌వ్వే కార్య‌క్ర‌మాన్ని జీహెచ్ఎంసీ ముమ్మ‌రంగా చేప‌ట్టింది. వీటితో పాటు న‌గ‌ర‌వాసుల‌కు ఉచితంగా పంపిణీ చేయ‌డానికి నిర్దేశించిన 35ల‌క్ష‌ల మొక్క‌ల్లో ఎల్బీన‌గ‌ర్, చార్మినార్‌ జోన్‌ల‌లో 7ల‌క్ష‌లచొప్పున‌, ఖైర‌తాబాద్‌, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి జోన్‌ల‌లో 5ల‌క్ష‌ల చొప్పున‌, సికింద్రాబాద్ స‌ర్కిల్‌లో 6ల‌క్ష‌ల మొక్క‌ల చొప్పున కేటాయించారు. ఇప్ప‌టికే కొన్ని జోన్‌ల‌లో పాఠ‌శాల విద్యార్థుల‌కు మొక్క‌ల పంపిణీ ప్రారంభించారు.
34 న‌ర్స‌రీల్లో మొక్కల పెంప‌కం
జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న 34న‌ర్స‌రీల్లో 40ల‌క్ష‌ల మొక్క‌లు సిద్దంగా ఉంచారు. జీహెచ్ఎంసీ నాట‌నున్న 5ల‌క్ష‌ల మొక్క‌ల్లో 2,92,404 మొక్క‌లు 5ఫీట్ల‌కు పైగా ఎత్తుగ‌ల మొక్క‌లు ఉన్నాయి. ప్ర‌ధానంగా ఈ మొక్క‌ల్లో వేప‌, జువ్వి,  కానుగ‌, జ‌మ్మిల‌తో పాటు పండ్ల మొక్క‌లైన స‌పోట‌, మామిడి, అల్ల‌నేరేడు, బాదం త‌దిత‌ర ప‌లు ర‌కాల మొక్క‌లు సిద్దంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్ల‌లో పెంచుకునేందుకు ఔష‌ద మొక్క‌లు ఉచితంగా పంపిణీ చేయ‌డానికి ఏర్పాట్ల‌ను పూర్తిచేశారు.
హ‌రిత‌హారానికి స‌ర్వం సిద్దమైన జీహెచ్ఎంసీhttps://www.telugumuchatlu.com/ghmcc-which-is-well-suited-for-greenhouses/
Tags; GHMCC, which is well-suited for greenhouses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *