తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

-ఏడుగురు మృతి.

Date:30/10/2020

రాజమండ్రి  ముచ్చట్లు:

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం అనంతరం ఏడుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని  రాజమహేంద్రవరం, గోకవరం ఆసుపత్రులకు తరలించారు. పెళ్లికి  హాజరై శుక్రవారం తెల్లవారుజామున    మూడుగంటల సమయంలో  తిరిగి వెళ్తుండగా  ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండపై నుండి వాహనం  క్రిందకు పడింది.  అయితే, వ్యాన్ డ్రైవర్ వేగంగా నడుపుతూ నిద్రమత్తులో మలుపు తిరుగుతుండగా ఘటన జరిగిందని స్థానికులు అంటున్ఆరు. తీవ్రంగా గాయపడిన నలుగురిని   రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. మృతులు   గోకవరం (మం) టాకుర్ పాలెం గ్రామానికి చెందిన యళ్ళ శ్రీదేవి (35), యళ్ళ నాగ శ్రీ లక్ష్మి (10), కంబాల భాను(35), సింహాద్రి ప్రసాద్( 25) పచ్చకూరి నరసింహం (24), చాగంటి హేమ శ్రీలత (12), సోమరౌతు గోపాలకృష్ణ (72). సమాచారం అందగానే పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని   సహాయక చర్యలు  చేపట్టారు.

 

 

 

ఘటనపై స్థానిక మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్  అరా తీసారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పాటు ఎస్పీ తో  మంత్రి మాట్లాడారు. ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కుడా అధకారులతో మాట్లాడారు.  జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి క్షతగాత్రులను కాకినాడ  గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించాలని సూచించారు. బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆళ్ల నాని కాకినాడ  సూపరింటెండెంట్ కు ఆదేశించారు. పెళ్లి వ్యాన్ బోల్తా ఘటనలో 5గురు మృతి బాధాకరం. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని అయన అన్నారు.

వకీల్ సాబ్ షూటింగ్ కోసం ప్రిపేర్

Tags: Ghora road accident at Thantikonda Kalyana Venkateswaraswamy temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *