-ఆరుగురు దుర్మరణం
Date:02/12/2020
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలోని మల్కాపూర్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బోర్ వెల్ లారీ ఢీకొని డ్రైవర్ సహ ఆరుగురు దుర్మరణం చెందారు.ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు ఇన్నోవా కారులో పదకొండు మంది వున్నారు. కర్ణాటక లో గురుమిట్కల్ కు వెళ్తున్నారు. మృతులు ఆసిఫ్ ఖాన్ కుటుంబికులు. ఘటన జరిగిన ప్రాంతంలో వున్న రోడ్డు మలుపులుతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
Tags; Ghora road accident near Malkapur gate