ఏలూరు జిల్లాలొ ఘోరం… ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మృతి

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి లో విద్యుత్ ప్రమాదం జరిగింది. 11 కేవీ విద్యుత్ వైరు తెగి ఇద్దరు యువ రైతులు మృతి చెందారు. దేవులపల్లి గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, వాల్లేపల్లి ఫణీంద్ర విద్యుదాఘాతానికి గురయ్యి మృతి చెందారు. మృతులు ఇద్దరు అన్నదమ్ములు. పుంత రహదారి పై 11  విద్యుత్ వైరు తెగిపడింది. ద్విచక్ర వాహనానికి వైరు తగలడంతో  మోటార్ సైకిల్  దగ్దమయింది. విద్యుత్ ప్రవహించడంతో మంటలు అంటుకోడంతో సంఘటనా స్థలం లోనే నాగేంద్ర, ఫణీంద్ర మృతి చెందారు. వాళ్లీద్దరూ పాలు తీయడానికి పొలం వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులు నాగేంద్ర బి.టెక్ చదువుతుండగా తమ్ముడు ఫణీంద్ర ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి అనారోగ్యంతో వుండడంతో తో పాలు తేవడానికి పొలం వెళ్లారు. ఇద్దరు కుమారులు మరణించడంతో మృతుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగేంద్ర, ఫణీంద్ర ల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు గ్రామస్థులు. లక్కవరం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

 

Tags: Ghoram in Eluru district అన్న Brother-in-law killed in same family

Post Midle
Post Midle
Natyam ad