గిడుగు రుద్రరాజు అరెస్టు అన్యాయం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు
కడప ముచ్చట్లు:

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సోమవారం అధాని అక్రమ వ్యాపారాలపై నిరసిస్తూ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వాలని బయలుదేరిన సమయంలో పోలీసులు వారిని విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దనే, వెళ్లనీయకుండా అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆదాని గ్రూపులలో పెట్టుబడులను ప్రోత్సహించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం ఆదాని గ్రూపు కంపెనీలు డొల్ల కంపెనీలని, విషదమవుతున్నదని, అలాంటప్పుడు ఆదానీ గ్రూప్ కంపెనీలలో కేంద్రం ఏ విధంగా పెట్టుబడును ప్రోత్సహిస్తుందో తెలపాలన్నారు.దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని గవర్నర్ గారిని కోరడానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం సరైన చర్య కాదన్నారు.పోలీసు బలం ఉపయోగించే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు.ఇప్పటికైనా కేంద్రం అదానీ గ్రూపులలో పెట్టుబడులు విరమించుకొని, అదాని ఆర్థిక లావాదేవీల పై విచారణ చేపట్టడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్నారు.
లేదా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు
Tags; Gidugu Rudraraj’s arrest is unjust
