Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మకు బంగారు మాంగల్యం, వెండి మెట్లు బహుకరణ

చౌడేపల్లి ముచ్చట్లు:

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానములో   31-  తేది అదివారము దేవస్థాన ఛైర్మన్   V. నాగరాజరెడ్డి  ఆద్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చినందున వారికి ఇబ్బందులు కలుగకుండా శ్రీ అమ్మవారి దర్శనము జరుగుచున్నట్లు చర్యలు తీసుకొన్నారు.  మహాలక్ష్మి , సౌజన్య రెడ్డి, హైదరాబాదు వాస్తవ్యులు సుమారు రూ. 50,000/-ల విలువ చేసే బంగారు మాంగల్యం, వెండి మెట్లు మరియు  హారిక &  షరాజన్, హైదరాబాదు వాస్తవ్యులు రూ. 1,00,000/- విలువ చేసి 40 స్టీలు టేబుళ్లు, 100 కుర్చీలు విరాళముగా ఇవ్వడము జరిగింది. వీరికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Gift of gold Mangalyam and silver stairs to Sri Boyakonda Gangamma

Post Midle