పెళ్లి చేసుకుంటే ఆరు  ల‌క్ష‌ల  గిఫ్ట్

Date:27/10/2020

టోక్యో ముచ్చట్లు:

పెళ్లి చేసుకుంటే ఆరు  ల‌క్ష‌ల  గిఫ్ట్ స‌రే… ఇది జ‌పానోళ్లు ఇస్తోన్న గిఫ్ట్. ఏకంగా ఆరు ల‌క్ష‌ల జ‌పాన్ క‌రెన్సీ ఇస్తోంది అక్క‌డి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్. దేశం మొత్తానికి ఇది వ‌ర్తిస్తోంది. 6 ల‌క్ష‌ల  ఎన్ లు ఇస్తూ.. ఎంక‌రేజ్ చేస్తోంది.పెళ్లి చేసుకుంటే ఇల్లో హ‌నీమూన్ గిఫ్టో ఇస్తారు కానీ.. ఇలాంటి 6 ల‌క్ష‌ల ఎన్ లు ఎందుకు ఇస్తున్నారు చెప్మా అంటే.. పిల్ల‌ల కోసం అంట‌. జ‌పానోళ్లు ప‌ని  మొహాలు  క‌దా. వాళ్ల‌కి ప‌ని ఉంటే చాలు. ఇల్లు వాకిలీ.. పెళ్లం పిల్ల‌లు ఏమీ గుర్తుండ‌వు. యంగ్ ఏజ్ లో ఉన్నోళ్లైతే.. మ‌న ద‌గ్గ‌ర అమ్మాయిల వెంట తిరుగుతుంటారు. వాళ్లేమో.. కంపెనీల వెంట మాత్ర‌మే తిరుగుతుంటారు. ఒక చోట పని చేస్తూ కూడా ఇంకేమైనా ప‌ని దొరుకుద్దేమో అని చూస్తుంటారు. అంద‌మైన అమ్మాయిని.. మంచి ప‌నినీ ప‌క్కన పెడితే  వాళ్లు మాకు ప‌నే కావాలి అంటారు. ప‌ని చేస్తే పైస‌ల్ ఇవ్వం అన్నా స‌రే.. ప‌నే ప‌నే అంటారు. అందుకే.

 

వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేయ‌డానికి ఇలాంటి గిఫ్ట్ ఇస్తోంది జ‌పాన్  సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్.ఇలా పెళ్లీ పెటాకులు లేకుంటే పిల్ల‌లు ఎలా పుడ‌తారు చెప్పండి. పెళ్లికి పిల్ల‌ల‌కీ లింకేంటి అనే వాళ్లున్నా.. వాళ్లు ఆ రొమాన్స్  ని కూడా ఇష్ట ప‌డరు. అలాంటోళ్లు పెళ్లేం చేసుకుంటారు చెప్పండి. అందుకే.. పెళ్లి చేసుకున్న వాళ్లు కొన్నాళ్ల పాటు పెళ్లి ఎందుకు చేసుకున్నాం రా అని ఫీల‌వ‌కుండా గ‌వ‌ర్న‌మెంటే డ‌బ్బులిస్తోంది. ఇలా ఇస్తే భారంగా ఫీల్ కాకుండా పెళ్లి చేసుకుని.. పిల్ల‌ల్ని కంటే దేశంలో పిల్ల‌ల సంఖ్య పెరిగిద్ది అనేది వారి న‌మ్మ‌కం. విడ్డూరం ఏంటంటే.. అయినా పెద్ద ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేద‌ట‌. చూడాలి..ముందు ముందు ఏమైనా రెస్పాండ్ అవుతారేమో అని వెయిట్ చేస్తోంది అక్క‌డి గ‌వ‌ర్న‌మెంట్.

నోరు తెచ్చిన తంటా

Tags: Gift of six lakhs if married

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *