కామారెడ్డి, ఎల్లారెడ్డికి వరాలు

నిజామాబాద్ ముచ్చట్లు:

 

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, 100 శాతం కాళేశ్వరం జలాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రికేసీఆర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కామారెడ్డి కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కేసీఆర్‌ వెంట స్పీకర్‌ పోచారం, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ కూడా ఉన్నారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కామారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్ కూడాకామారెడ్డి జిల్లాకి మంజూరు చేస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. తెలంగాణలో కరెంట్‌ కొరత లేకుండా చేశామని సీఎం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 25 టీఎంసీల నీటిని కామారెడ్డి పరిసర గ్రామాలకు అందిస్తామని కేసీఆర్ చెప్పారు.అంతకుముందు కేసీఆర్ సిద్దిపేటలో సుదీర్ఘంగా మాట్లాడారు. గతంలో ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు సిద్దిపేట ఎంతో మారిందని అన్నారు. బంగారు తెలంగాణ కచ్చితంగా సాధించి తీరతామని తేల్చి చెప్పారు. కొంత మంది మొరుగుతున్నారని వారి అరుపులను పట్టించుకొనేది లేదని కొట్టిపారేశారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Gifts to Kamareddy and Ellareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *