గిరీష్ కన్నాడ్ ఇక లేరు

Date:10/06/2019

బెంగళూర్  ముచ్చట్లు:

ముఖ బహుభాషా నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కర్నాడ్.. బెంగళూరులోని లావెల్లే రోడ్‌లో ఉన్న తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ మహారాష్ట్రలోని మాథెరన్‌లో 1938 మే 19న జన్మించారు. గిరీష్ తల్లి కృష్ణబాయి చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఆమెకు అప్పటికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. నర్స్ అయిన కృష్ణబాయిని డాక్టర్ రఘునాథ్ కర్నాడ్ వివాహం చేసుకున్నారు. ఆ తరవాత జన్మించిన నలుగురు సంతానంలో గిరీష్ కర్నాడ్ ఒకరు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. నాటక రచనలో గిరీష్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయన్ని గౌరవించింది. అలాగే ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు కూడా దక్కింది. ఇక సినిమాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయి. తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కొమరం పులి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘ధర్మచక్రం’లో వెంకటేష్ తండ్రిగా, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో చిరంజీవి తండ్రిగా నటించిన గిరీష్ కర్నాడ్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు
ఇద్దరు సీఎంలు సంతాపం

 

 

 

 

ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గిరీష్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ చేసిన సేవలకు గాను ఆయనకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు లభించాయని అన్నారు. కాగా, గిరీశ్ కర్నాడ్ మృతిపై ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం తెలిపారు. సినీ, సాహిత్య రంగాలకు ఆయన మృతి తీరని లోటుగా అభివర్ణించారు.

 

 

ఆయన లేని లోటు తీరనది : చంద్రబాబు

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్(81) నేటి ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడిగా, దర్శకుడిగా గిరీశ్ కర్నాడ్ చేసిన సేవలను చంద్రబాబు కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ మృతి సినీ రంగానికే కాకుండా సామాజిక సేవారంగానికి కూడా తీరని లోటన్నారు. సామాజికవేత్తగా ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యలుకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

యువరాజ్ క్రికెట్ కు గుడ్ బై

 

Tags: Girish Connade is no longer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *