బాలిక ఆత్మహత్య

హైదరాబాద్ ముచ్చట్లు:


నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలిక  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నారు. భవనంపై పెంట్‌ హౌస్ ఇనుప మెట్లకు‌కు బాలిక  ఆత్మహత్య చేసుకుంది. అయితే ఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అత్యాచారానికి వడిగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. బాలిక ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Tags: Girl commits suicide

Post Midle
Post Midle
Natyam ad