Natyam ad

చిరుత దాడిలో బాలిక మృతి.

తిరుపతి  ముచ్చట్లు:

 

అలిపిరి నడక మార్గంలో విషాదం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. తమ బిడ్డను చిరుతు లాక్కెళ్లిందని పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. లక్షిత మృతి దేహం కోసం‌ టిటిడి అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం వద్ద ఈ దాడి జరిగింది. నెల క్రితం మూడేళ్ళ బాలికపై చిరుత దాడి చేసింది. రాత్రి తిరుమలకు వెళ్తున్న టైంలో పాపను చిరుతు లాక్కెళ్లిపోయింది. అయితే పాపా తప్పిపోయిందని అంతా అనుకున్నారు. తమతో వచ్చిన పాప కనిపించడం లేదని పోలీసులుకు లక్షిత ఫ్యామిలీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్‌గా విచారణ చేపట్టారు. రాత్రాంతా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంగా గాలింపు చర్యలు చేపట్టినా పోలీసులు, టీటీడీ సిబ్బంది పాప కనిపించలేదు.

 

 

Post Midle

ఉదయం సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అయితే కాలినడకన వెళ్తున్న భక్తులకు లక్షిత డెడ్‌బాడీ కనిపించింది. చాలా మంది ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు. వెంటనే కొందరు తిరుమల సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి డెడ్‌బాడీని పరిశీలించారు. ఫ్యామిలీ చెప్పిన ఆనవాళ్లు ఉండటంతో అది లక్షిత మృతదేహంగా గుర్తించారు. భక్తుల ద్వారా సమాచారం విషయం బయటకు వచ్చింది. పాప మృతదేహాన్ని పాస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. పాప మృతితో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. తిరుమలేశుడి దర్శనానికి వస్తే పాప ప్రాణం పోయిందని బోరుమంటోందా ఫ్యామిలీ.

Tags:Girl dies in leopard attack

Post Midle