బాలిక అదృశ్యం… విషాదాంతం

Date:18/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

రాత్రి నుంచి సుమేధ కోసం జోరుగా గాలించారు నాల వద్ద జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలతో వెతకడం ప్రారంభించారు. అయితే చిన్నారి శవం బండ చెరువులో లభ్యం అయ్యింది.హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లో అదృశ్యం అయిన బాలిక కథ విషాదంతం అయ్యింది. నిన్న రాత్రి సైకిల్‌పై బయటకు వెళ్లిన సుమేధ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో కలిసి నిన్నరాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ బండచెరువులో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. అప్పటివరకు తమ పాపా ఏదో ఓ చోట క్షేమంగా ఉంటుందని అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి మరణ వార్త విని కుపకూలిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.పాప సైకిల్‌పై బయటకు వెళ్లిన ఫుటేజ్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. సుమేధ సైకిల్ నాలాలో దొరకడంతో నాలాలో కొట్టుకుపోయిందేమోనని అధికారులు, పోలీసులు జోరుగా గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటి క్రితమే బండ చెరువలో సుమేధ మృతదేహం గుర్తించారు. ఘటనస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కూడా బాధితులను పరామర్శించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు పాప డెడ్ బాడీని అప్పగించనున్నారు.

 

ప్రగతి భవన్ దగ్గర సీతక్క అరెస్ట్

 

Tags:Girl disappears … tragedy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *