ఆర్టీసీ బస్సులో బాలికకు లైంగిక వేధింపులు

ఆర్టీసీ బస్సులో బాలికకు లైంగిక వేధింపులు

– కండక్టర్ పై పోక్సో కేసు నమోదు.

 

అనంతపురం ముచ్చట్లు:

బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు ఇలా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వేధింపులకు గురిచేసే కామాంధులు కాచుకొని కూర్చున్నారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా వారిని లైంగికంగా వేధిస్తున్నారు. ఇష్టంవచ్చినట్టుగా వారిని టచ్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నరు. తాజాగా, అనంతపురం జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి చెందిన ఓ మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తించాడు ఆ బస్సులో కండక్టర్గా ఉన్న వ్యక్తి దీంతో డయల్ 100కు కాల్ చేసింది బాధిత బాలిక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాడిపత్రిలో ఆళ్లగడ్డ బస్సు డిపోకు చెందిన కండక్టర్ మహమ్మద్ రఫీని అదుపులోకి తీసుకు న్నారు.బాలిక ఫిర్యాదుతో ఆ కండక్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి టౌన్ పోలీసులు. నందాల జిల్లా సిరివెళ్ల గ్రామం చెందిన వ్యక్తిగా గుర్తించారు.

 

Tags:Girl sexually assaulted in RTC bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *