ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన

నిర్మల్ ముచ్చట్లు:

 

నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండల కేంద్రంలో మూడేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని, వెంటనే పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బంధువులతో కలిసి బైఠాయించింది .      దిలవార్ పూర్ మండల కేంద్రానికి చెందిన దొడ్డి రజిత అనే యువతిని అదే గ్రామానికి చెందిన ప్రమోద్ రెడ్డి అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నామని, సంవత్సరం క్రితం మన కులాలు వేరు నేను పెళ్లి చేసుకోనని చెప్పడంతో తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఖాయం చేసుకునే ఎంగేజ్ మెంట్ చేసుకోగా తన ప్రియుడు ప్రమోద్ రెడ్డి వరుని ఇంటికి వెళ్లి గత మూడేళ్లుగా తాము ప్రేమించుకున్నామని నేనే పెళ్లి చేసుకుంటానని మీరు సంబంధాన్ని రద్దు చేసుకోవాలని చెప్పడంతో వివాహం రద్దయిందని, తీరా పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేస్తున్నాడని, ఈ విషయమై పోలీసు స్టేషన్ ముందు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, చేసేదేమీ లేక ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టానని, తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని, ప్రియుడితో తన పెళ్లి జరిపించి తనకు న్యాయం చేయాలని రజిత డిమాండ్ చేసింది .

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Girlfriend worried in front of boyfriend’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *