ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

Girls in the Inter results
Date:13/04/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
గతేడాదితో పోలిస్తే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ ఫస్టియర్ లో మేడ్చల్ జిల్లాకు ప్రథమస్థానం లభించిందన్నారు. అలాగే ఫస్టియర్ చివరి స్థానంలో మహబూబ్నగర్ జిల్లా చివరి స్థానంలో ఉందన్నారు.  ఈసారి ఫలితాల్లో ప్రభుత్వ గురుకులాల హవా కొనసాగింది. అలాగే, అమ్మాయిలదే అగ్రస్థానం దక్కగా, బాలురు  వెనుకబడ్డారు. ఇంటర్ రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 67.06 వుండగా మొదటి సంవత్సరం ఉత్తీర్ణతశాతం 62.73 గా వుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అమ్మాయిలు 72.70శాతం, అబ్బాయిలు 60.99శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం అమ్మాయిలు 68.85శాతం, అబ్బాయిలు 56.36శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి   ఫలితాల్లో గిరిజన గురుకుల విద్యార్థులు అగ్రస్థానం లో వుండగా, రెండో స్థానంలో సాంఘిక సంక్షేమ గురుకులాలు నిలిచాయి.  మూడో స్థానంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, నాల్గో స్థానంలో ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి.  ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో  మేడ్చల్, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలు ప్రథమ స్థానం దక్కించుకున్నాయి. చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా నిలిచింది. మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.  గత ఏడాదితో పోల్చితే ఈసారి ఇంటర్‌ ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. రీకౌంటింగ్‌కు ఈనెల 20వరకు గడువు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
Girls in the Inter results
Girls in the Inter results
Tags:Girls in the Inter results

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *