బాలికలు సమాజంపై అవగాహన పెంచుకోవాలి

Girls should increase understanding of society

Girls should increase understanding of society

– న్యాయమూర్తి భారతి

Date:11/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

బాలికలు ప్రతి ఒక్కరు పత్రికలు చదవుతూ…సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలని, కేవలం పుస్తకాలకే పరిమితం కారాదని, ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి భారతి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆమె న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెప్ప, మల్లికార్జునరెడ్డి, తహశీల్ధార్‌ మాదవరాజుతో కలసి ఎన్‌ఎస్‌.పేట, భగత్‌సింగ్‌ కాలనీలో న్యాయవిజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసి, అందులో భాగంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి భారతి మాట్లాడుతూ యూనైటెడ్‌ నేషన్స్ 19 డిసెంబర్‌ 2011న వారు నిర్ణయించిన మేరకు ప్రతి యేటా 11 అక్టోబర్‌ బాలికల అంతర్జాతీయ దినోత్సవాలను జరపాలని నిర్ణయించిన మేరకు జరపడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా బాలికలు బాలురతో సమానంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. బాలికలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు బయపడుతున్నారని, బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలను బాలికలు వినియోగించుకోవాలన్నారు. బాలికలు బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా బెదిరించినా, ర్యాంగింగ్‌ చేసిన తక్షణమే తల్లిదండ్రులకు, సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. దీని ద్వారా పోకిరిల ఆటకట్టించేందుకు వీలుందన్నారు. అలాగే బాలికలు చిన్నతనంలో ప్రేమలో పడి వెళ్లిపోవడం, ఆశ పడి ఇల్లువదిలి వెళ్లిపోవడం మంచిపద్దతి కాదన్నారు. తెలిసి తెలియని వయసులో ఆడపిల్లలను మోసగించే వారు ఎక్కువుగా ఉన్నారని, వీరి పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రతి ఒక్కరు బాలికలకు ఎక్కడ అన్యాయం జరిగినా తమకేందుకని వెళ్లిపోకుండ రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ రేష్మ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

దోమలు నిర్మూలనకు చర్యలు

Tags: Girls should increase understanding of society

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *