అవమానంతో బాలిక ఆత్మహత్య

Girl's suicide with shame

Date:15/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణం మేలుపట్లలో నివాసం ఉన్న చిన్నప్ప కుమారై పుష్పారాణి(24) సోమవారం రాత్రి అవమానంతో ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుష్పారాణి నాయుడుపేటలోని ఓ ప్రైవేటు ప్యాక్టరీలో ఉద్యోగం చేస్తోంది. ఇలా ఉండగా ఈమెకు సమీప బందువైన సోమల మండలం , పట్రపల్లెకు చెందిన గుణశేఖర్‌తో వివాహం నిశ్చయమైంది. ఇలా ఉండగా పుష్పారాణి నాయుడుపేటలో ఒక యువకుడితో సన్నిహితంగా ఉందన్న అనుమానంతో గుణశేఖర్‌, అతని సోదరుడు రేవంత్‌ కలసి నాయుడుపేటకు వెళ్లి ఆయువకుడిపై దాడి చేసి, పుష్పారాణిని అవమాన పరిచారని అ బాలిక పుంగనూరుకు వచ్చింది. రాత్రి తనకు జరిగిన అవమానాన్ని తల్లికి వివరించింది. తల్లి పట్టణంలోకి వెళ్లి వచ్చేలోపు ఇంటిలోనే ప్యాన్‌కు ఉరి వేసుకు ఆత్మహత్య చేసుకుంది. ఆమె వచ్చి చూసే సరికి పుష్పారాణి మృతి చెందింది. ఇరుగుపొరుగువారు కలసి బాలికను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

పదోతరగతి విద్యార్థుల విజయకేతనం

Tags: Girl’s suicide with shame

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *