డీడీలు కట్టిన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు ఇవ్వండి

Date:21/11/2020

ఆదోని  ముచ్చట్లు:

ఆదోని నియోజవర్గంలో డీడీలు కట్టిన ప్రతి కుటుంబానికి  ఇంటి పట్టాలు ఇవ్వాలని  టిడిపి నాయకులు  డిమాండ్ చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ లు మున్సిపల్ కమిషనర్ ఆర్ జి వి కృష్ణా కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ తిమ్మప్ప మారుతీ లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్ కొరకు లక్ష రూపాయలు 50,వేల. 500 రూపాయలు కట్టిన ప్రతి  కుటుంబానికి ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీడీలు కట్టిన కొందరికి ఇంటి పట్టాలు  మీకు రాలేదని క్యాన్సిల్ అయ్యాయి అని అధికారులు చెబుతున్నారు అన్నారు. ఎలా క్యాన్సిల్ అయితాయి అని తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు ప్రశ్నించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆర్ జీ వి కృష్ణ మాట్లాడుతూ 500 రూపాయలు కట్టిన వాళ్లు కూడా ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాన్సల్ అయిన వ్యక్తులు కూడా చూస్తానని ఎందుకు అయినాయో విచారిస్తాం  అన్నారు లబ్ధిదారులకు అందరికీ  ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఈరన్న,హుసేని, రామంజి,నరసింహులు, లక్ష్మీనారాయణ, సజ్జాద్, సైదుల్లా,రామంజి, ఇతరులు పాల్గొన్నారు.

నందింగం.. ఉండవల్లి మధ్యలో డొక్కా

Tags: Give home deeds to every family that builds deeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *