పెన్షన్లు ఇవ్వండి మాజీ మంత్రి ఈటల రాజేందర్

హుజూరాబాద్  ముచ్చట్లు:

గత 17,18 సంవత్సరాల నుండి అధికారం లో ఉన్న లేకున్నా ప్రజల వైపు ఉండి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నా. నా రాజీనామ తరువాతనయినా ఆగిపోయిన పెన్షన్ లు వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత పెళ్ళిళ్ళు అయి విడిపోయిన వారికి ఓట్ల కోసమయిన రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు చూస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నియోజ వర్గం లో తెల్ల రేషన్ కార్డులు కానీ పెన్షన్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలి. 58 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారో వాళ్లకు కూడా పెన్షన్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న.. 2018 నిరుద్యోగ యువకుల కోసం నిరుద్యోగ బృతి ఇస్తామని హామీ ఇచ్చారో హుజూరాబాద్ లో ఓట్ల కోసమయినా వాటిని మంజూరు చేయాలని కోరుతున్నా. గతంలో నేను వావిలాల,చల్లుర్ మండలాలు అవకాశముంటే  హుజూరాబాద్ ను  జిల్లా గా మార్చాలని కోరినా.  పరిపాలన సౌలభ్యం కోసం మా ప్రజల కోరిక మేరకు వావిలాల,చాల్లుర్ ను మండలాలు చేసి హుజూరాబాద్ ను జిల్లా గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. రెండున్నర సంవత్సరలుగా సర్పంచ్లు,ఇతర ప్రజా ప్రదినిదులు చేసిన పనుల బిల్లులు వెంటనే మంజూరు చేయాలి. మండల పరిషత్ లు జిల్లా పరిషత్ లు నిర్వీర్యం అయిపోయినాయి.అందుకే మండలానికి పడి కోట్లు గ్రామాలకు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు మంజూరు చేయాలి. ఎక్కడ బై ఎలక్షలు వచ్చిన ఆ నియోజక వర్గం లో వరాల జల్లు కురిపించేలా వుంది.  ఈ నియోజక వర్గం లో కూడా పెండింగ్ పనులు మంజూరు చేస్తూ జి ఓ ఇవ్వాలని కోరుతున్నా..  గొర్ల మంద మిద తోడేళ్ళు పడ్డట్టు ఎన్నడూ ఈ నియోజక వర్గానికి రాని నాయకులు ఇప్పుడు వస్తున్నారు.

 

హుజూరాబాద్ నియోజక వర్గం లో స్థానిక నాయకులతో మమేకమై ఉన్న తరుణం లో తల్లి నీ బిడ్డ బి విడదీసే తరహాలో విడదీస్తున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గం లో మిడతలు దండు దాడి చేసినట్టు దాడి చేస్తున్నారని ప్రజలు బాధపడుతున్నారు.  తెలంగాణ లో ప్రజలు ఎం ఎల్ ఏ లకు ఓట్లు వేసింది హుజూరాబాద్ ప్రజల మీద దాడి చేయమని కాదు బానిసలుగా బతికితే బతకండి కానీ ఈ రకమయిన దాడులు చేస్తే నియోజక వర్గ ప్రజలు తీపి కొడతారు. నేను వేరే పార్టీ పెడుత అనలేదు నేను వేరే పార్టీ కి పోత అనలేదు మీరే నన్ను బహిష్కరించారు. 2018 లో నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు.అన్ని భరించాను అది నా సహనం తప్ప భయం కాడుం ఇక్కడ కూరుక్షేత్ర యుద్ధం జరగబోతుంది ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధం లో హుజూరాబాద్ ప్రజలు యుద్ధం సాధిస్తారు. ప్రజాస్వామికంగా గెలిచే ప్రయత్నం చేయండి దొంగ దారిన గెలిచే ప్రయత్నం చేస్తే మా ప్రజలు ఊరుకోరని అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Give pensions
Former Minister Itala Rajender

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *