Give Timescale: TTD Employees Union Leader Ratnaprabhakar

టైంస్కేల్ ఇవ్వండి : టిటిడి ఉద్యోగుల సంఘం నాయకుడు రత్నప్రభాకర్

-33వ రోజుకు చేరిన నిరసన దీక్షలు

Date:18/09/2020

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌ను APCOSలో విలీనం చేయ‌కుండా టైంస్కేల్ వర్తింపచేయాలని టిటిడి ఉద్యోగుల సంఘం నాయకుడు రత్నప్రభాకర్ కోరారు. టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద చేపడుతున్న నిర‌స‌న దీక్షలు శుక్రవారం 33వ రోజుకు చేరుకున్నాయి.ఈ సంద‌ర్భంగా రత్నప్రభాకర్ మాట్లాడుతూ టిడిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చాలా సంవ‌త్స‌రాలుగా అంకిత‌భావంతో విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు ఇచ్చిన హామీ మేర‌కు అంద‌రికీ టైంస్కేల్ వ‌ర్తింప చేయాల‌ని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంద‌రూ టైంస్కేల్ కోసం ఎదురుచూస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో APCOSలో విలీనం చేయాల‌ని టిటిడి బోర్డు నిర్ణ‌యించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. టైంస్కేల్‌కు సంబంధించి టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డితోపాటు బోర్డు స‌భ్యులు మ‌రియు తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ప‌లుమార్లు హామీలిచ్చార‌ని గుర్తు చేశారు.టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిప్రసాద్‌ మాట్లాడుతూ మూడు నెలలుగా పోరాటం చేస్తుంటే ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సీఎం గారు అర్హత కలిగిన వారికి మూడు నెలల్లోనే టైం స్కేల్ ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఆప్కాస్ లో విలీనం చేయడం తగదన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సమష్టిగా పోరాడాలని, అందరూ కలిసి రావాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హరికృష్ణ, ఉపాధ్యక్షుడు జి.హరికృష్ణ, కోశాధికారి నవీన్ కుమార్‌, నాయకులు బిడ్డ‌ల రూప్‌కుమార్‌, నిరంజన్, గణేష్, టిటిడిలోని ప్రెస్‌, అన్న‌దానం, ఉద్యాన‌వ‌న‌, హాస్ట‌ళ్లు, మ్యూజియం, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, టైపిస్ట్ సొసైటీల‌కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Tags:Give Timescale: TTD Employees Union Leader Ratnaprabhakar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *