గొంతెండుతోంది (చిత్తూరు జిల్లా)

Giving (Chittor District)

Giving (Chittor District)

Date:12/10/2018
మదనపల్లె  ముచ్చట్లు:
పట్టణానికి తాగునీటి సమస్య తప్పలేదు..నాలుగు లేదా ఐదు రోజులకోసారి మాత్రమే వారికి తాగునీరు అందుతోంది.. ఈ నీళ్లు చాలని వారు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి రెండు బిందెలకు రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 1.35 లక్షలకు పైచిలుకు జనాభా ఉండగా, అనధికారికంగా 1.80 లక్షలు ఉన్నట్లు అంచనా. గత పదేళ్ల వ్యవధిలో పట్టణ జనాభా అనూహ్యంగా పెరిగింది. ఇంతమంది జనాభా ఉన్న పట్టణానికి రక్షిత మంచినీటి పథకాలే లేవు. ఒకప్పుడు పట్టణ ప్రజల దాహార్తి తీర్చిన బెంగళూరు రోడ్డులోని  వేంపల్లె రిజర్వాయర్‌ ప్రస్తుతం అడుగంటిపోయింది. మదనపల్లె  పట్టణ శివారు ప్రాంతాలైన చంద్రాకాలనీ, మంజునాథకాలనీ, చేనేతనగర్‌, కనకదాస్‌నగర్‌, అమ్మచెరువుమిట్ట, అనపగు్ట, బసినికొండ, మోతీనగర్‌ వంటి ప్రాంతాల్లో వలస వచ్చిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరందరికీ పురపాలక సంఘం తాగునీటిని అందించాల్సి ఉంది.
మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీరు సరఫరా చేయడానికి 262 బోరుబావులను తవ్వించారు. ఇందులో ప్రస్తుతం 170 మాత్రమే పనిచేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కొన్నింటిలో నీటి లభ్యత తగ్గిపోయింది. ప్రజలకు తాగునీటిని అందించడానికి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 13 ఈఎల్‌ఎస్‌ఆర్‌, జీఎల్‌ఎస్సార్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉన్న బోరుబావుల ద్వారా వీటిని నింపి నీటిని పైపు లైన్ల ద్వారా అందజేస్తున్నారు. పనిచేస్తున్న 170 బోర్లలో చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. ఇవి కాకుండా 182 చేతిబోర్లు ఉండగా, ఇందులో కూడా 100 బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మరోవైపు పైపులైన్లు దుస్థితికి చేరుకున్నాయి. నీటి నిర్వహణకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌ కేటాయిస్తారు.
ఈ సారి కూడా 2018-19 వార్షిక బడ్జెట్‌లో తాగునీటి నిర్వహణకు రూ.లక్షలు కేటాయించారు. పైపుల మరమ్మతులు, ఏర్పాటు వంటి వాటికి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. పురపాలక సంఘం పరిధిలో 35 వార్డులుండగా, 1.80 లక్షల జనాభా ఉంది. సాంకేతికంగా అధికారులు లెక్క వేసిన ప్రకారం రోజుకు 18.31 ఎంఎల్‌డీ సరఫరా చేయాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి లభ్యత తగ్గింది. గత మార్చి నెలలో 11.28 ఎంఎల్‌డీ నీరు అందిస్తుండగా, ప్రస్తుతం పురపాలక సంఘం అధికారులు 8.13 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే అందిస్తున్నారు. పవర్‌బోర్ల  ద్వారా రోజుకు 4.30 ఎంఎల్‌డీ నీటిని ఇస్తున్నారు.
అనపగుట్ట, కనకదాస్‌నగర్‌, చంద్రాకాలనీ మంజునాథకాలనీ చేనేతనగర్‌, నీరుగట్టువారిపల్లెలో కొంతభాగం తాగునీటిని 4 లేదా 5 రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. పట్టణంలో తాగునీటి సరఫరాకు నెలకు విద్యుత్తు  వినియోగం ఖర్చు రూ.40 లక్షలకు పైబడి వస్తోంది. జనవరిలో ప్రభుత్వం తాగునీరు అవసరాలకు రూ.2.30 కోట్ల  నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు వినియోగించి రోజుకు 400 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నా ప్రజలకు పూర్తిస్థాయిలో నీరు అందడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
తాగునీటి సరఫరా, నిర్వహణపై అధికారులు పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపడం లేదు. తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన పైపులు పగిలి లీకేజీ అవుతున్నాయి. బి.కె.పల్లెలో హెడ్‌ వాటర్‌ వర్క్స్‌కు సంబంధించి పురపాలక సంఘం 20 బోరుబావులను తవ్వించింది. ఒకటి రెండు బోర్లు మినహా మిగిలిన వాటిలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కోట్లు ఖర్చు చేసి వేసిన బోరుబావులను అధికారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. 20లో ఆరు బోర్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ముందస్తు ప్రణాళిక లేమి కారణంగా అధికారులు నీటి సరఫరాలో లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు.
ఇక్కడ బోర్లు ఏర్పాటు చేశారే కానీ, 20 బోరుబావుల్లో నుంచి నీటిని సరఫరా చేయడానికి అవకాశం లేకుండాపోయింది. బి.కె.పల్లె నుంచి పైపు లైను ద్వారా రామారావుకాలనీ, నీరుగట్టువారిపల్లె, రెడ్డీస్‌ కాలనీ, ప్రశాంత్‌నగర్‌ తదితర ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు. 20 బోరు బావులను వినియోగించుకోవాలంటే ఆరు ఇంచుల పైపును తొలగించి దాని స్థానంలో పెద్దపైపు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీన్ని ఏర్పాటు చేయడానికి రూ.60 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంటున్నారు.
ఆరు బోరు బావుల్లోని నీటిని ఈ పైపులైను ద్వారా పంపుతుంటే సామర్థ్యం చాలక  లీకేజీ అవుతున్నాయి. పట్టణంలో 15 బోరుబావుల్లో  మోటార్లు ఊడిపోయి కిందకు పడిపోయాయి. వీటిని కూడా పైకి తీయడానికి అధికారులు చర్యలు తీసుకోలేదు.ఈ  కారణంగా పురపాలక సంఘానికి లక్షల రూపాయలు వృథా అవుతున్నాయి. మరికొన్ని చోట్ల బోరుబావిలో భూగర్భజలాలు అడుగంటిపోతే మోటారుతోపాటు పైపులు కూడా అలాగే వదిలేశారు.
Tags:Giving (Chittor District)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *