బోసిపోతున్న కేజీహెచ్

Date:12/03/2018
వైజాగ్  ముచ్చట్లు:
 కేజీహెచ్‌పై జూనియర్‌ వైద్యుల సమ్మె గణనీయ ప్రభావం చూపుతోంది. అత్యవసర వైద్య సేవల పరంగా పెద్దగా ఇబ్బంది లేకున్నా.. సాధారణ సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇంటిముఖం పడుతున్నారు. కాస్త  నయం అవుతున్న రోగులను డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపుతున్నారు. కనీసం పడకలే దొరకని పరిస్థితి ఉండే కేజీహెచ్‌లో భావనగర్‌, రాజేంద్రప్రసాద్‌ మెడికల్‌ వార్డుల్లో కొన్ని మంచాలు శనివారం ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం నాటికి పెద్దాసుపత్రి మరింత ఖాళీ అయ్యే అవకాశం ఉంది. శనివారం ఒక్కరోజే దాదాపు 200 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు. ఆ స్థాయికి తగ్గట్టుగా రోగులను చేర్చుకోలేదు. దాదాపు వంద మంది రోగులు మాత్రమే ఆసుపత్రిలో చేరారు. ప్రతీ రోజూ డిశ్చార్జిల కన్నా వివిధ రకాల రుగ్మతలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యే అధికంగా ఉండేది. అత్యవసర కేసులను మాత్రమే చేర్చుకుంటున్నారుఓపీ విభాగాలకు వచ్చే రోగుల సంఖ్య శనివారం తగ్గింది. శనివారం పలు ఓపీ విభాగాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎముకలు, మెడిసిన్‌, సర్జరీ, ప్రసూతి, పిల్లల విభాగం తదితర చోట్ల కాస్త రద్దీ కనిపించింది. అక్కడ సీనియర్‌ వైద్యులు తక్కువ సంఖ్యలో చూడడం వల్ల రోగులు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం కేజీహెచ్‌లోని వివిధ విభాగాల్లో దాదాపు 800 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అత్యవసర విభాగాలైన క్యాజువాల్టీ, ఈఎండీ, ఐఆర్‌సీయూ, ఐసీసీయూ, ఏఎంసీయూ, ఐపీసీయూ వంటి విభాగాల్లో మాత్రం జూనియర్‌ వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెవిలో పూల లాంటివంటూ జూనియర్‌ వైద్యులు నిరసన పాటించారు. కేజీహెచ్‌ ప్రధాన ద్వారం నుంచి ప్లకార్డులు, చెవిలో పువ్వులతో ప్రభుత్వ వైఖిరిని నిరశిస్తూ ప్రదర్శన సాగించారు.
Tags: Giving KGh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *