ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ఆ దేవుడు ఇచ్చిన వరం సింగరెడ్డి. గోవర్ధన్ రెడ్డి

కడప  ముచ్చట్లు :
కడప నగరంలోని  న్యూ రిమ్స్ హాస్పిటల్ వద్ద రోజుకొక వెరైటీ భోజనము తో ప్రతిరోజు దాదాపు 500 మంది కరోనా సహాయకుల కు అన్నం పెట్టడం ఆ దేవుడు ఇచ్చిన వరం అని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. గత ఆరు సంవత్సరముల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గ్రీవెన్స్ సెల్ కు వచ్చే ప్రజలకు తనకు తోచిన రీతిలో ప్రతి సోమవారం అన్న ప్రసాద వితరణ చేస్త్చున్న తరువాత గ్రీవెన్స్ సెల్ రద్దు చేయడం వలన ఈ కరోనా సమయంలో  రిమ్స్ కు వచ్చే  పేద ప్రజలు అన్నం దొరకడం కష్టం గా ఉంది ఇప్పటి పరిస్థితులలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కొనసాగించి వుంటే పేదలకు పట్టెడన్నం దొరికేది తన వంతుగా అన్న ప్రసాద వితరణ చేస్తున్న అన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమిళనాడు లో  ముఖ్యమంత్రి స్టాలిన్ అమ్మ క్యాంటీన్ ల ను కొనసాగిస్తున్నారని ఈక్కడ కూడా అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలని ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి సూచించారు.  ఈ కార్యక్రమంలో మాజీ శాప్ డైరెక్టర్ దుద్యాల జయచంద్ర మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్  ఖాసిం, బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Giving rice to the hungry is a God-given gift
Singareddy. Govardhan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *