Natyam ad

ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు

పగిడ్యాల ముచ్చట్లు:
పగిడ్యాల మండలం లోని పాల మర్రి  ప్రాథమిక పాఠశాలలో దామోదరం సంజీవయ్య  101వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ ఉత్సవాలకు మండల విద్యాశాఖ అధికారి సుభహన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు దామోదరం సంజీవయ్య జీవితచరిత్ర గురించి తాను  చేసినటువంటి నిస్వార్ధమైన సేవల గురించి దేశానికి చేసిన సేవలు గురించి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మల్లయ్య . గ్రేస్ వినీల . మరియు సునీత . పాల్గొనడం జరిగింది. ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మన దేశానికి గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి నాయకులు మళ్లీ మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాను అలాగే మన కర్నూలు జిల్లా కు కు కూడా దామోదర సంజీవయ్య గారి పేరు పెడితే చాలా సముచితంగా ఉంటుందని  భావిస్తున్నారు.
 
Tags: Glorious Damodaram Sanjeevayya Jayanti celebrations

Leave A Reply

Your email address will not be published.