ఘనంగా దసరా వేడుకలు

Date:18/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

Glorious Dussehra celebrations

నవరాత్రి వేడుకల్లో భాగంగా రెండవ రోజు వివిధ ఆలయాలలో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, ఆదివారం వేకువజాము నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని బస్టాండులో గల శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారిని త్రిపూర సుందరి అలంకారం ఏర్పాటు చేసి, పూజలు చేశారు. అలాగే పట్టణంలోని బజారువీధిలో గల శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అలంకారించారు. అలాగే బోగనంజుండేశ్వరిస్వామి ఆలయంలో గల పార్వతిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పట్టణంలోని తూర్పుమొగశాలలో గల చాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. వీటితో పాటు పట్టణ సమీపంలోని మాదనపల్లెలో శ్రీషిరిడిసాయిబాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే పట్టణంలోని చెరువు కట్టపైన, కొత్తయిండ్లలో గల సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో దసరా పూజలు సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి, వేకువజాము నుంచి పూజలు, హోమాలు , అభిషేకాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయాలు భక్తులకు కిటకిటలాడింది. భక్తులకు ఆలయ ధర్మకర్తలు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

పుంగనూరు నియోజక వర్గం లో బొమ్మల పరిశ్రమ ఏర్పాటు చేయాలి

Tags: Glorious Dussehra celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *