ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Date:26/11/2020

నర్సీపట్నం  ముచ్చట్లు:

నర్సీపట్నంలో  దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు  ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ మహనీయుడు అని అన్నారు. అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా రాజ్యాంగ ను రచించిన ఏకైక నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అందరూ రాజ్యాంగ ను అనుసరిస్తూ,రాజ్యాంగ మనకు ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు డాక్టర్ బాబు, మండల అధ్యక్షులు యాదగిరి, దాసు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం అప్పలరాజు, వైసీపీ నాయకులు సిటీల రాము, మామిడి శ్రీనివాసరావు ,మర్రా నాగరాజు, వర్ణ శేఖర్, రాపర్తి అప్పారావు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు దినేష్, లావరాజు, ఋషి తదితరులు పాల్గొన్నారు.

నివర్‌ వరద భీభత్సం

Tags: Glorious Indian Constitution Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *