Glorious International Day of the Divine

ఘనంగా అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం

Date:03/12/2020

టిఫిన్ బాక్సులు పంపిణీ చేసిన వ్యాపారి ప్రసాద్ శెట్టి

గోనెగండ్ల  ముచ్చట్లు:

ప్రతి ఒక్కరిలో  నైపుణ్యం ఉంటుందని ప్రోత్సాహకం అందిస్తే వారికున్న ఆర్ధిక సమస్యలను తట్టుకొని తమ వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని అందులో దివ్యంగులు ముందుంటారని మండల విద్యాఅధికారి వినోద్ కుమార్ తెలిపారు, మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారంరోజు భవిత దివ్యంగుల పాఠశాలలో ఐఆర్పి అనురాధ, ఆదినారాయణమ్మ ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సంధర్బంగా మండల విద్యా అధికారి వినోద్ కుమార్ ప్రధానోపాధ్యాయులు శాంతిరాజు, మాట్లాడుతూ దివ్యంగులకు ఉపయోగపడే పరికరాలు అందిచడంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తు వారు సాధారణ జీవితం గడిపేలా వాకింగ్ స్టిక్,కాలిబర్, వినికిడి యంత్రాలు,ట్రైసైకిళ్ళు, వంటివి పంపిణీ చేస్తున్నారని అన్నారు,దివ్యంగులకు ఆసరా నిచ్చి వారు గౌరవంగా జీవిస్తూ సాదారణ జనజీవనంలో భాగమై సమాన అవకాశాలు కల్పించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్య ఉపాధి సామాజిక, ఆర్ధిక సాంస్కృతిక పరంగా దివ్యంగుల ఎదుగుదల ను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు, అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిత పాఠశాల విద్యార్థులకు వ్యాపారి ప్రసాద్ శెట్టి టిఫిన్ బాక్సులు పంపిణీచేశారు, దివ్యంగుల తల్లి తండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేలా కృషిచేయాలని ఉపాధ్యాయులు వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పరికరాలు అందిస్తూ మంచి విద్యను అందిస్తారని,వారితో పాటు దివ్యంగులకు తమవంతు సహకారం అందిస్తామని అన్నారు,ఈ కార్యక్రమంలో ఫిజియోథేరఫీ అనురాధ, గానిగ బాషా, బస్టాండ్ స్కూల్ ఛైర్మన్ చెన్నకేశవులు,కళాకారులు కరుణాకర్, పాల్గొన్నారు,

 

బీజేపీ పార్టీ ని బలోపేతం చేయాలి

Tags:Glorious International Day of the Divine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *