ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు

కరీంనగర్ ముచ్చట్లు:
 
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి తమ్మడి ఏజ్రా.. నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొరివి అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో నగరంలోని జ్యోతినగర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా, మంత్రి గా అనేక పదవులు అలకంకరించి నేటికీ అలుపెరుగకుండా ప్రజాసేవలో ముందుండటమనేది.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరశీల పోరాటాలు చేయడం కేవలం జీవన్ రెడ్డికే సాధ్యమైందన్నారు.  భవిష్యత్ లో జీవన్ రెడ్డి మరిన్ని ఉన్నతమైన పదవులు పొంది ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్, ఎండి తాజ్, లింగంపెళ్లి బాబు, కుర్ర పోచయ్య, విలాస్ రెడ్డి, జీడీ రమేష్, ఎండి చాంద్, విక్టర్, ఇర్ఫాన్, అజ్మత్, జీలకర్ర రమేశ్, పోరండ్ల రమేశ్, శహిన్షా తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Glorious MLC Jeevan Reddy Birthday Celebrations

Natyam ad