ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
చౌడేపల్లె ముచ్చట్లు:
జాతీయ యువజన దినోత్సవ వేడుకలను బుధవారం నరేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ . సురేంద్రబాబు,డాక్టర్ రాజమణిల సహకారంతో ఘనంగా నిర్వహించారు. బస్టాండులో వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్,లో కోవిడ్ నివారణకు మాస్క్లు, శానిటేజర్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బందికి మాస్క్లు, శానిటేజర్లతోపాటు, రోగులకు పండ్లు, స్వీట్స్ లు పంపిణీ చేశారు. యువత సమాజసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేన్ పౌండేషన్ అధ్యక్షుడు తులసీరాం, సభ్యులు నరేష్,రవి, మోహన్, మణి, రంజిత్, చందు, దేవేంద్ర తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Glorious National Youth Day celebrations