ఘనంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రధమ వర్ధంతి వేడుకలు

– స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం
-భక్తులకు అన్న ప్రసాదాల వితరణ
నెల్లూరు  ముచ్చట్లు:
 
నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని పడారుపల్లి ,దివ్యాంగుల కాలనీ ,హనుమాన్ జంక్షన్ లో ఉత్తర ముఖంగా వాయువ్య దిశలో రావిచెట్టు, వేపచెట్టు, జమ్మి చెట్టుల నడుమ  వాయుపుత్రుడుగా వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతూ అభయం ఇస్తున్నారు.     దాతలు, భక్తులు, పుర ప్రముఖుల సహకారంతో దివ్యాంగుల ఆధ్వర్యంలో నిర్మితమై అందరి సంకల్పంతో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు నిత్య పూజలు అందుకుంటున్నారు.
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పూర్తయి సంవత్సరం అయిన సందర్భంగా మొదటి వార్షిక మహోత్సవాన్ని దాతలు, భక్తులందరి సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటలకు హోమాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పద్నాలుగున్నార 14.5 అడుగుల ఆంజనేయ స్వామి వారికి పాలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు.అనంతరం కన్నులపండువగా మునుపెన్నడూ లేని విధంగా లక్ష తమలపాకుల పూజ ( నాగవల్లి దళ అర్చన) భక్త జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి గ్రామోత్సవం, స్వామి వారి భక్తులు, స్థానికుల నడుమ కోలాహలంగా జరిగింది..కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆంజనేయ స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.   ఈ కార్యక్రమంలో 23 వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాస్ రెడ్డి, స్థానిక డివిజన్ వైకాపా నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి, పామూరు మస్తాన్ రెడ్డి, యనమల మల్లికార్జున్రెడ్డి, పాతపాటి పుల్లారెడ్డి తదితరులతోపాటు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వి. రమేష్ నాయుడు, సిహెచ్ .బాబు యాదవ్, వై. వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Glorious Sri Abhaya Anjaneya Swamy Pradhama Vardhanthi Celebrations

Natyam ad