ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బియ్యపు  ఆకర్ష్ రెడ్డి   పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంధర్బంగా  ఆకర్ష్ రెడ్డి  ,శ్రీకాళహస్తిశ్వరాలయ దేవస్తానం ఛైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ముందుగా వైకాపా కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎవరితో పొత్తు లేకుండా ప్రజల బలంతో జగనన్న ఒక్కరి పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్నారు అని అన్నారు.నాడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలలో నేడు ఆనందోత్సవాలు చూస్తున్నామని తెలిపారు. ఆకర్ష్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచే జగనన్న వెంట నడిచిన మొదటి వ్యక్తి తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డి  ,శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మేల్యే అని అన్నారు.కడదాక జగనన్న వెంటే మా కుటుంబం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Tags:Glorious YSR Congress Party 12th Emergence Day Celebrations

Leave A Reply

Your email address will not be published.