Natyam ad

వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామి స్నపన తిరుమంజనం

తిరుపతి ముచ్చట్లు:

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు ఆదివారం స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ శేషాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు,తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.

 

Post Midle

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున రోజా, తామ‌ర‌, రోజ్ పెట‌ల్స్‌, రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, వ‌ట్టి వేరు, తుల‌సి వంటి ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో  గోపినాథ్‌, సూపరింటెండెంట్  వెంక‌ట‌స్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  కిరణ్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

Tags: Glory be to Sri Bhu Sametha Kalyana Venkateswara Swami Snapana Thirumanjanam

Post Midle