Natyam ad

చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం

తిరుపతి ముచ్చట్లు:


శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు గురువారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌  సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్  సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  చలపతి,  సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

Tags: Glory of Sri Kodandaram on Chandraprabha vehicle

Post Midle
Post Midle