గ్లూకో మీటర్ ఖరీదు ఐదు లక్షలు : సోము వీర్రాజు

Glucose meter costing five lakhs: Somme Veera Raju

Glucose meter costing five lakhs: Somme Veera Raju

Date:18/09/2018
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో వైద్య పరికరాలు నిర్వహణ కోసం పీబీఎస్ అనే సంస్థ కు కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరికరాలు లెక్కించి వెయ్యి కోట్లు విలువైన పరికరాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఒప్పందం ప్రకారం పరికరాలు బాగు చెయ్యకుండా 51 కోట్లు దుర్వినియోగం చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం నాడు అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు.  దీని పై హై కోర్ట్ లో పిల్ కూడా దాఖలు చేశారు.
వేల కోట్ల రూపాయల దుర్వినియోగానికి గురయ్యాయి. గ్లూకో మీటర్ ఖరీదు 5లక్షలు చూపించారు అంటేనే ఎంత దుర్వినియోగం చేస్తున్నారో అర్ధం అవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం అవినీతి తవ్వటానికి గునపలు చాలవు బుల్డోజర్ లు కావాలి. అవినీతి మీద మండలి లో ప్రస్తావిస్తే కంప్లైంట్ చేస్తున్నాను అని చిన్న బాబు అంటున్నారని అయన విమర్శించారు. అవినీతిని అంతమందించే కార్యక్రమాన్ని బీజేపీ తీసుకుంటుందని అయన అన్నారు.
Tags:Glucose meter costing five lakhs: Somme Veera Raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *