హోదా అమలు చేయలేని మోడీ గో బ్యాక్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీకటి చార్లెస్
కడప ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు చేయకుండా మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు రావడానినీ నిరసిస్తూ, కడప జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మోడీ గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చీకటి చార్లెస్,బండి జకరయ్య జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావులు అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కడప కలెక్టరేట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చిందని, కానీ అనంతరం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు అయినా ప్రత్యేక హోదాను అమలుపరచలేదనిఅన్నారు.కాంగ్రెస్ అయిదు లక్షల కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ కు మేలు చేస్తే, మోడీ ప్రభుత్వం అవన్నీ నెరవేర్చలేదన్నారు.రాయలసీమ ఉత్తరాంధరులకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కాంగ్రెస్ ఇస్తే, దానిని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎగవేసిందన్నారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ ఇస్తే, దానిని బిజెపి ప్రభుత్వం ఇప్పటికి నెరవేర్చలేదన్నారు.విద్యాసంస్
జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అడగ లేకుండా ఉన్నాడన్నారు.
2024 లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రజలు సుఖసంతోషాలతో ఉండగల రన్నారు.నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తో పాటు నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి, పీసీసీ డెలిగేట్స్ బండి జకరయ్య ,సత్తార్, చార్లెస్, తిరుమలేష్, రాష్ట్ర మైనార్టీ నేత ఆరిపుల్లా, శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా చైర్మన్ నూకల చిన్న కులయప్ప, మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్యామలాదేవి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్, బీసీ నేతలు ప్రసాద్ , ఎరికలయ్య, నగర ఉపాధ్యక్షుడు మధు రెడ్డి, వేణుగోపాల్, అరుణ, లోకేశ్వరి, సంతోషి, పాల్గొన్నారు.
Tags: Go back Modi who cannot implement the status
