ఇప్పటికైనా మెట్టు దిగి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

-మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Date:19/10/2019

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెట్టు దిగి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రానికి తండ్రి లాంటి వారని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు చురకలంటించినా.. కేసీఆర్‌ తీరు మారకపోవడం బాధకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ చర్యలను గమనిస్తుందని.. అదును చూసి ఆయన పని పడుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను కూడా ఇలానే ఇబ్బంది పెట్టి ఉంటే.. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. పరిస్థితులు చేయి దాటకముందే.. మేల్కొంటే మంచిదని సూచించారు. గవర్నర్‌ ఆర్టీసీ సమ్మెపై ఆరా తీస్తున్నారంటే.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది మొదలయినట్లే అని మోత్కుపల్లి  పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషిచేయాలి

Tags: Go down one step and solve the problems of RTC workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *