రహదారులపై ఎడమవైపున వెళ్లాలి

Go left on the roads

Go left on the roads

– సీఐలు గంగిరెడ్డి, మధు

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలు ట్రాఫిక్‌ పట్ల అవగాహన పెంచుకుని రహదారులపై ప్రయాణించే సమయంలో ఎడమవైపున ప్రయాణించాలని , దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరుతూ కీప్‌లెఫ్ట్ అన్న నినాదంతో ర్యాలీ నిర్వహించారు. బుధవారం పట్టణ సీఐ గంగిరెడ్డి, రూరల్‌ సీఐ మధుసూదనరెడ్డి , పోలీసులు , ఆటో డ్రైవర్లు కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సెం•ల్‌కుమార్‌ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించామన్నారు. ఈ మేరకు కీప్‌లెఫ్ట్ అన్న నినాదంతో ప్రయాణికులకు రహదారి సూచనలు, భద్రత గూర్చి వివరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండ ప్రమాదాలను నివారించేందుకు ఎడమవైపున ప్రయాణించాలన్నారు. అలాగే మితిమీరిన వేగం ప్రమాదకరమన్నారు. వాహనదారులు హెల్మెంట్‌ వినియోగించాలని, సీటుబెల్టు ధరించాలని కోరారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రాణంతకమన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వరాదని సూచించారు. అలాగే మధ్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహదారి భద్రతలను పాటించి అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అరుణ్‌కుమార్‌రెడ్డి, రవికుమార్‌, పోలీసులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా జాబితా విడుదల

Tags: Go left on the roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *