Natyam ad

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పధకాలను పోందుకోండి.

తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న సినీ కార్మికులు “ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్” నందు నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పధకాలను పోందుకోవాలని చిత్రపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందితేనే,కార్మికులు జీవితాలు మెరుగు పడతాయి. శ్రీనివాసులు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం  25-08-2022 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి పట్టణం అంబేద్కర్ భవన్ వద్ధ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కార్మికశాఖ సలహా మండలి అధ్యక్షులు శ్రీ వి. శ్రీను వాసులునాయుడు  ముఖ్య అతిథి గా పాల్గోని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి 24 క్రాఫ్ట్స్ సభ్యులు అందరూ కలిసి కృషి చేయాలని కార్మికులు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిందని వాటిని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ద్వారా 24 క్రాఫ్ట్స్ కార్మికులు పోందుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు ఫెడరేషన్ లో సభ్యులుగా నమోదు చేసుకుని,ఐకమత్యం తో ముందుకు సాగాలని తెలియజేసారు.

 

 

Post Midle

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా  మాట్లాడుతూ….. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రపరిశ్రమ హైదరాబాద్ లో ఎంతో అభివృద్ధి చెందిందని అలాగే విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని ఇక్కడ చిత్రపరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృషి చేస్తుందని 24 క్రాఫ్ట్స్ కార్మికులు అందరూ సహకరించాలని, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో కార్మికులు అందరూ నమోదు చేసుకోవాలని కోరారు.
జూనియర్ ఆర్టిస్ట్ ఎజంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తుకూరు నరసింహులు  మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చెందుతుందని ఎందుకంటే ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా  పట్టుదల, శక్తి సామర్థ్యాలు తనకు తెలుసని ఆయన ఆధ్వర్యంలో ఫెడరేషన్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని తోటివారి అభివృద్ధికి ఫెడరేషన్ సభ్యులు అందరూ కృషి చేయాలని కోరారు.ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాపా ధనుంజయ్   మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్. కమిటీ సభ్యులు ఎప్పుడూ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే ఆలోచనలు చేస్తారని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా గారు అయినందున ఈ ఫెడరేషన్ ట్రాన్స్ ఫెరేంట్ గా పని చేస్తున్నదనడానికి ఎలాంటి ఢోకా లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మిక సోదరులు అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ సేవలను 24 క్రాఫ్ట్స్ కార్మికులు అందరూ వినియోగించు కోవాలని, సభ్యులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందిస్తామని తెలిపారు.

 

 

జూనియర్ ఆర్టిస్ట్ ఎజంట్స్ అసోసియేషన్ కార్యదర్శి చవల మురళీ కృష్ణ గారు మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అందరూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేదిక పైకి రావాలని అప్పుడే కార్మికులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సభ్యులు అందరూ సహకరించాలని కోరారు.నటులు, దర్శకులు జి.యల్. కుమార్ గారు మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి 24 క్రాఫ్ట్స్ కార్మికులు అభివృద్ధి చెందడానికి ఈ ఫెడరేషన్ కృషి చేస్తుందని, ఐకమత్యమే మహా బలమని నటినటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ ఫెడరేషన్ లో నమోదు చేసుకోవడానికి సహకరించాలని తెలిపారు.నటులు శివరామరాజు గారు మాట్లాడుతూ….మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అందరూ సహాకరించాలని ముఖ్యమంత్రి  20 శాతం షూటింగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని చెప్పడం కార్మికులు అభివృద్ధికి నాంది పలికినట్లని నిర్మాతలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ జరపాలని ఫెడరేషన్ కూడా తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

 

 

దర్శకులు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ….మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన కళాకారులు సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారని వారందరూ ఈ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నందు నమోదు చేసుకోవాలని ఫెడరేషన్ కు అధ్యక్షులు తోరం రాజా  ఆధ్వర్యంలో బ్రాండ్ ఇమేజ్ తీసుకుని రావాలని దాని కోరకు కళాకారులు, సాంకేతిక నిపుణులు తమ సహాకారం అందించాలని సూచించారు.రచయిత్రి నాదేళ్ల శాంతకుమారి  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు అందరూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నందు నమోదు చేసుకుని తద్వారా తాము అభివృద్ధి చెందడానికి కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో దర్శకుడు విశ్వనాథ రెడ్డి , నటిమణి తిరుపతి శోభారాణి , రచయిత సిద్ధేంద్ర శర్మ , శాంబలహరి నాధ్ ,  మాధురి,  లక్ష్మి , వల్లి ,  రాణి,నరేష్ తదితర నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Go through the schemes offered by the central government.

Post Midle